: దర్శకుడు గుణశేఖర్ పై నటుడు సుమన్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు
సీనియర్ నటుడు సుమన్ దర్శకుడు గుణశేఖర్ పై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. 'రుద్రమదేవి' చిత్రంలో నటించినందుకు గుణశేఖర్ ఇచ్చిన రూ.5 లక్షల చెక్కు బౌన్స్ అయిందని, దానిపై గుణశేఖర్ ను అడిగినా స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించానని సుమన్ తెలిపారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమాకు దర్శకుడు, నిర్మాత గుణశేఖరే.