: నాడు అఘాయిత్యం... నేడు పెళ్లి: బాధితురాలని జైల్లోనే పెళ్లి చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్!


ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న దిలీప్ బెహరా గతేడాది జనవరి 23న బస్సు కోసం వేచి ఉన్న యువతిని బలవంతంగా కారులో ఎక్కించుని అత్యాచారం చేశాడు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవలే అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో, బెహరా జైలుకి వెళ్లాడు. అయితే, అనూహ్యంగా తన చేతిలో అఘాయిత్యానికి గురైన యువతిని బెహరా పెళ్లి చేసుకున్నాడు. ఈ పరిణయంతో నిన్న భువనేశ్వర్ లోని జరపడ జైలు పెళ్లి సందడితో కళకళలాడింది. ఈ పెళ్లికి జైలు అధికారులతో పాటు వధూవరుల బంధువులు, వారి తరఫున కోర్టులో కేసును వాదించిన న్యాయవాదులు హాజరయ్యారు. తామిద్దరమూ పెళ్లి చేసుకోవాలన్న బెహరా, బాధిత యువతి ఉమ్మడి పిటిషన్ ను పరిశీలించిన కోర్టు తన సమ్మతి తెలిపింది. కోర్టు అనుమతితో బాధిత యువతిని పెళ్లి చేసుకున్న బెహరా, తనను విడుదల చేయాలని కోర్టును కోరనున్నాడట. ఈ విషయాన్ని బాధిత యువతి తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News