: వరల్డ్ కప్ లో డీఆర్ఎస్ అమలుకు ఐసీసీ నిర్ణయం


వచ్చే నెలలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) ను అమలు చేసేందుకు ఐసీసీ నిర్ణయించింది. దుబాయ్ లో జరిగిన ఐసీసీ సమావేశంలో దీనిపై చర్చించారు. మొత్తం 49 మ్యాచ్ లలోనూ డీఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ ఫిబ్రవరి 14న ప్రారంభమవుతుంది. కాగా, డీఆర్ఎస్ ను తొలిసారి 2009లో న్యూజిలాండ్-పాకిస్థాన్ టెస్టు సిరీస్ లో ప్రవేశపెట్టారు. అయితే, ఈ విధానంలో కచ్చితత్వం లేదంటూ బీసీసీఐ తమ సిరీస్ లలో డీఆర్ఎస్ అమలును ఇప్పటిదాకా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఐసీసీ తాజా నిర్ణయం బీసీసీఐని ఇబ్బంది పెట్టేదే. 2011 వరల్డ్ కప్ లోనూ డీఆర్ఎస్ అమలు చేసినా ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ బెల్ విషయంలో వివాదాస్పదమైంది.

  • Loading...

More Telugu News