: కిరణ్ బేడీకి రెండు ఓటర్ ఐడీ కార్డులు!
ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ సమస్యల్లో చిక్కుకోబోతున్నారు. వేరు వేరు అడ్రస్ లతో ఢిల్లీలో ఆమెకు రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయని తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుపుతోంది. ఎన్నికల సంఘం రికార్డు ప్రకారం... రాజధానిలోని ఉదయ్ పార్క్, తల్కతోరా లేన్ అడ్రస్ లతో ఓటర్ గుర్తింపు కార్డులు ఇచ్చారట. ఇదే విషయంపై బేడీని మీడియా అడిగితే ఖండించారు. మరోవైపు ఈ విషయం గురించి తెలుసుకుని విచారణ జరుపుతున్నామని ఎన్నికల సంఘం అధికారి చెప్పారు. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తన రెండు కార్డుల్లో ఒకటి క్యాన్సిల్ చేయాలని బేడీ దరఖాస్తు చేసుకోకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని సూచించారు.