: ఫైనల్ చేరిన రష్యా బ్యూటీ షరపోవా... ఆస్ట్రేలియన్ ఒపెన్ సెమీస్ లో సునాయస విజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన సెమీ ఫైనల్ లో ఈ అందాల సుందరి, మకరోవాపై విజయం సాధించింది. 6-3, 6-2 స్కోరుతో వరుస సెట్లలో సునాయంగా మకరోవాను మట్టికరిపించిన షరపోవా, టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇప్పటికే పలుమార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన షరపోవా, 2008లో టైటిల్ నెగ్గింది. మరోసారి టైటిల్ సాధించాలనే కృతనిశ్చయంతో షరపోవా తుదిపోరుకు సమాయత్తమవుతోంది.