: టెంపర్ కి తిరుగులేదు: బండ్ల గణేష్
అలలకు అదుపులేదు, రాళ్లకు చూపులేదు, అభివృద్ధికి అంతు లేదు, టెంపర్ కి తిరుగులేదని ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. టెంపర్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, బాద్షా షూటింగ్ ముగిసిన తరువాత రెండు సినిమాలు పూర్తైన తరువాత ఎన్టీఆర్ మళ్లీ సినిమా చేస్తానన్నారు. అనుకున్నట్టే ఆయన పిలిచి సినిమా తీయమని చెప్పారని వెల్లడించారు. పూరీకి, తనకు ఆత్మీయ అనుబంధం ఉందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ 24 సినిమాలు ఒకెత్తు, టెంపర్ ఒక్కటీ ఒకెత్తని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి అనుభూతిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. 13న సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదే చెబుతారని ఆయన తెలిపారు.