: ప్రధాని మోదీని కలిసిన మేరీ కోమ్
ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఎందుకని అనుకుంటున్నారా? సొంత రాష్ట్రం మణిపూర్ లో మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. దీనిని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని ఆమె భావించారు. దీంతో, ఆమె ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి, బాక్సింగ్ అకాడమీని ప్రారంభించేందుకు ఆహ్వానించారు. కాగా, ఆయన స్పందన గురించి తెలియనప్పటికీ, ఫిబ్రవరిలో మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీ ప్రారంభం కానుంది.