: అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం


భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిల వేదికగా జరిగిన కోదండరాముని కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. వివాహ మంత్రోచ్చారణ మధ్య అభిజిత్ లగ్నాన పండితులు జానకిరాములకు మంగళసూత్ర ధారణ చేశారు. ప్రభుత్వం తరపున సమర్పించిన ముత్యాలతో సీతారాములకు తలంబ్రాల కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అనంతరం పుణ్య దంపతుల మెడలో ముత్యాల హారాలు వేశారు. ఈ సమయంలో వేద పండితులు పలువురికి ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు.

అంతకుముందు జానకిరాములకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టువస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సి.రామ చంద్రయ్య, పితాని సత్యనారాయణ, రాంరెడ్డి వెంకటరెడ్డి, పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News