: తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తి
తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 8 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. మొత్తం 31 నామినేషన్లు దాఖలు కాగా 8 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాంతో 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మరణించడంతో ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఆయన భార్య సుగుణమ్మ టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అటు, సంప్రదాయాన్ని కాదని కాంగ్రెస్ తన అభ్యర్థిని పోటీకి దింపిన సంగతి తెలిసిందే.