: ఏపీలో పెరిగిన కరవు మండలాల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరవు మండలాల సంఖ్య పెరిగింది. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన మరో నాలుగు మండలాలను కరవు జాబితాలో ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాయదుర్గం, శెట్టూరు, లేపాక్షి, కూడేరు మండలాల చేర్పుతో కరవు మండలాల సంఖ్య 230కి పెరిగింది.