: ఆంధ్రాలో తెలంగాణ హోం మంత్రి... బెజవాడలో మీడియా సమావేశం


తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనతాపార్టీ మాజీ అధ్యక్షుడు ఎం.ఏ. రెహమాన్ స్మారక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదును విశ్వకేంద్రంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. బంజారాహిల్స్ లో 8 అంతస్తుల కంట్రోల్ రూం నిర్మిస్తామని తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణకు షీ టీంలు ఏర్పాటు చేశామని చెప్పారు. వారు మఫ్టీలో ఉంటారని, మహిళలపై దాడులను, ఇతర హింసను అడ్డుకుంటారని వివరించారు. ఇక, తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాకతీయ మిషన్ కు రూ.22 వేల కోట్ల నిధులు కేటాయిస్తామని మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఓ తెలంగాణ మంత్రి ఏపీలో అడుగుపెట్టడం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News