: జగన్ దీక్షలపై మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి: ధర్మాన


వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపడుతున్న దీక్షలపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఎన్నికల వేళ రూ.లక్ష 14 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడా రుణాలను రూ.309 కోట్లకు కుదించిందని ఆరోపించారు. ఇది కచ్చితంగా ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఇన్సూరెన్స్ రాక, రుణాలు అందక రైతులు కష్టాలు పడుతున్నారని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై జగన్ ఈ నెల 31, ఫిబ్రవరి 1న తణుకులో దీక్ష చేస్తారని ఆయన వివరించారు. కాగా, జగన్ దీక్షపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం తెలిసిందే. ఉనికిని కాపాడుకునేందుకు జగన్ దీక్ష చేపడుతున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News