: కేసీఆర్ ఆదేశాలతోనే రాజయ్యను ఆసుపత్రి నుంచి గెంటేశారు: మోత్కుపల్లి
సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఆసుపత్రి నుంచి గెంటేశారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తనను బర్తరఫ్ చేయడంతో ఆ బాధ తట్టుకోలేక రాజయ్య గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని, అయితే, కేసీఆర్ అక్కడ కూడా తన అధికారం చెలాయించాడని విమర్శించారు. మాదిగల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దెబ్బతీశాడని మండిపడ్డారు. మాదిగలను పదవుల నుంచి తొలగిస్తే ఆ పదవులు మాదిగలకే ఇవ్వాలని అన్నారు. అయితే, దళితుడైన రాజయ్యను తొలగించి బీసీ వ్యక్తికి పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దేశంలో దళితులు లేని కేబినెట్ కేసీఆర్ ది మాత్రమేనని విమర్శించారు. ఆయన కేబినెట్ లో ఉన్న కడియం శ్రీహరిది దళిత రక్తం కాదని, ఆయన తల్లిదండ్రులు బీసీలని మోత్కుపల్లి ఆరోపించారు. తెలంగాణలోని దళితులకు కేసీఆర్ అన్యాయం చేశారని అన్నారు.