: ముడి చమురు ధరలు తగ్గినంతగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు: రఘువీరా
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గిన రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల ప్రకారం అయితే లీటరు డీజీల్ రూ.21, పెట్రోల్ రూ.29కి విక్రయించాలన్నారు. కానీ, ప్రస్తుతం అలా జరగడం లేదని రఘువీరా ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్న మాజీ ప్రధాని వాజ్ పేయి విధానానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. అంతేగాకుండా, దొంగచాటుగా మూడుసార్లు ఎక్సైజ్ పన్ను పెంచి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ దుర్మార్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించడం లేదన్నారు.