: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు అజిత్
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని తమిళ సినీ నటుడు అజిత్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో కుటుంబసభ్యులతో కలసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తరువాత టీటీడీ అధికారులు అజిత్ కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల అజిత్ ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా కొంతమంది యువకులు ఆయనకు స్వామివారి ఫోటోను బహుకరించారు. దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన 'ఎన్నై అరిందాల్' చిత్రం త్వరలో విడుదలకానుంది.