: విటులపై కేసులు పెట్టేలా చర్యలు తీసుకోండి: వ్యభిచారం కేసులపై ఉమ్మడి హైకోర్టు కీలక వ్యాఖ్య


వ్యభిచారానికి సంబంధించిన కేసుల నమోదుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యభిచార కేంద్రాలపై దాడులు చేస్తున్న పోలీసులు వ్యభిచారిణులు, నిర్వాహకులపై మాత్రమే కేసులు నమోదు చేస్తూ, విటులను వదిలేయడం సరికాదని అభిప్రాయపడింది. మహిళల అక్రమ రవాణా, వ్యభిచార నిరోధక చట్టం-1956 చట్టానికి సవరణలు చేయాలని శాసనకర్తలను కోరింది. ఇక నుంచి విటులనూ చట్టం పరిధిలోకి తేవాలని పేర్కొంది. వ్యభిచారం నిర్వహిస్తూ ఇటీవల పట్టుబడ్డ మహ్మద్ షాహీద్ అనే వ్యక్తిపై బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు గతవారం తీర్పు చెప్పారు. చట్టం ప్రకారం విటులపై కేసులు నమోదు చేయడం కుదరదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అదే సమయంలో చట్టానికి సవరణలు చేసి విటులపై కూడా కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని శాసనకర్తలను అభ్యర్థిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News