: రాజ్ భవన్ వద్ద కిడ్నాప్ కలకలం... బాలికల అపహరణకు వ్యక్తి విఫలయత్నం


హైదరాబాదులోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ కు కూతవేటు దూరంలో కొద్దిపేపటి క్రితం కిడ్నాప్ కలకలం రేగింది. రాజ్ భవన్ సమీపంలోని మక్తాలో ఇద్దరు బాలికలను అపహరించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. అయితే, ఆ విషయాన్ని పసిగట్టిన స్థానికులు అతడిని పట్టుకున్నారు. పట్టపగలు బాలికలను అపహరించేందుకు యత్నించిన అతడికి దేహశుద్ధి చేసిన స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు. రాజ్ భవన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.

  • Loading...

More Telugu News