: ఏపీలో 24 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు: మంత్రి కామినేని


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 24 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వైన్ ఫ్లూతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారని వెల్లడించారు. ఫ్లూ నిరోధానికి సాయం చేయాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. ఇదిలా ఉంటే, అనంతపురం జిల్లాలో స్వైన్ ఫ్లూతో ఓ బాలింత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో డయాలసిస్ కోసం వచ్చిన మహిళకు స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News