: ఉలవపాడు పీఎస్ లో లొంగిపోయిన ‘చాగల్లు’ డ్రైవర్... పోలీసుల వ్యాఖ్యలతో బాధితుల వేదన


ప్రకాశం జిల్లా ‘చాగల్లు’ దుర్ఘటనకు సంబంధించి వోల్వో బస్సు డ్రైవర్ కొద్దిసేపటి క్రితం ఉలవపాడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. బస్సు నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి తక్షణమే బస్సును నిలిపేశాడు. అనంతరం ప్రయాణికులను అప్రమత్తం చేసి భారీ ప్రాణ నష్టాన్ని నివారించాడు. బస్సు మంటల్లో దహనమైపోతుండటాన్ని కళ్లారా చూసి భయభ్రాంతులకు గురైన అతడు బస్సు క్లీనర్ తో కలసి పరారయ్యాడు. అయితే, కొద్దిసేపటి క్రితం అతడు ఉలవపాడు పీఎస్ కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇదిలా ఉంటే, రాత్రి ఒంటి గంటకు ప్రమాదం జరిగితే, మూడు గంటల తర్వాత కాని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు. ఆలస్యంగా చేరుకోవడమే కాక, తమను అవమానపరచే విధంగా పోలీసులు వ్యాఖ్యానించారని బాధితులు వాపోతున్నారు. ‘‘సామాగ్రి కాలిపోయిందని బాధపడతారెందుకు? ప్రాణాలతో బయటపడ్డారు... సంతోషించండి’’ అంటూ ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలతో తాము మనోవేదనకు గురయ్యామని పలువురు బాధితులు చెప్పారు

  • Loading...

More Telugu News