: తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో అన్యమత ప్రచారం... అధికారులే ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలు
తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో అన్యమత ప్రచారానికి సంబంధించిన ఘటన నేటి ఉదయం వెలుగు చూసింది. కళాశాల వసతి గృహంలోని విద్యార్థులకు పలు మతాల నుంచి పెద్ద ఎత్తున పుస్తకాలు చేరుతున్నాయి. వసతి గృహంతో పాటు కళాశాలలో పనిచేస్తున్న కొందరు అధికారులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఈ తంతు నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలలో అన్యమత ప్రచారంపై విద్యార్థులు భగ్గుమన్నారు. కళాశాలలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితి చేయిదాటిపోకుండా చర్యలు చేపట్టారు.