: కర్నూలు జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు... డోన్ ఎమ్మెల్యే అనుచరుడిని హతమార్చిన ప్రత్యర్థులు


ఫ్యాక్షనిజానికి కేంద్రంగా పేరుపొందిన కర్నూలు జిల్లాలో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. జిల్లాలోని డోన్ మండలం కొత్తబురుుజులో నేటి ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ప్రత్యర్థుల దాడిలో శాంతిరాజ్ అనే వ్యక్తి హతమయ్యాడు. శాంతిరాజ్ పై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేసి అతడిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ కు శాంతిరాజ్ ముఖ్య అనుచరుడని తెలుస్తోంది. శాంతిరాజ్ హత్య నేపథ్యంలో కొత్తబురుజులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News