: మోదీ వల్ల పారిశ్రామికవేత్తలే లాభపడుతున్నారు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. మోదీ వల్ల పారిశ్రామికవేత్తలకే లబ్ధి చేకూరుతోందని, పేదవాళ్లు అలాగే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమే మోదీ పాకులాడుతున్నారని రాహుల్ విమర్శించారు. ప్రధాని మాటలు చెప్పడం కాదని, చేతల్లో చూపాలని అన్నారు. పని ఎప్పుడు మొదలుపెడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఎందుకంటే, కాంగ్రెస్ పేదల కోసం పోరాడే ఏకైక పార్టీ అని పేర్కొన్నారు.