: అప్పులు చేసైనా సరే రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి: యనమల
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందికరంగానే ఉందన్నారు. అప్పులు చేసైనా సరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని అన్నారు. ఆర్థిక లోటు రోజురోజుకీ పెరుగుతూ ఉందని, ఆర్థిక లోటు పెరుగుదల అభివృద్ధికి విఘాతం కలిగించేదేనని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో ఆలోచిస్తున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్ 14వ ఆర్థిక సంఘం కేటాయింపులు పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ రూపొందిస్తామని యనమల చెప్పారు.