: ఆ ప్రకటన చేసినందుకే రాజయ్యపై వేటు: మోత్కుపల్లి ఆరోపణ


కేసీఆర్కు తెలియకుండా హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటుపై ప్రకటన చేసినందుకే టి.రాజయ్యపై వేటు వేశారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి 50 లక్షల మంది మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై నేడు మోత్కుపల్లి నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకుంది దళితులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. మాదిగ కులస్థులకు కేబినెట్లో ఎందుకు అవకాశం కల్పించలేదని అడిగారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచారంటూ కితాబు ఇస్తూ, ఆయన బర్తరఫ్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన చేతిలో ఉన్న శాఖలకు ఎంతవరకు న్యాయం చేశారో చెప్పాలని కేసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News