: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే: బాన్ కీ మూన్


ఐక్యరాజ్యసమితి చీఫ్ బాన్ కీ మూన్ భారత్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన దౌత్య ప్రస్థానం 1972లో భారత్ లోనే ప్రారంభమైందని తెలిపారు. భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటుందని అన్నారు. అప్పట్లో తాను భారత్ లో ఉన్నప్పుడు తనకు కేటాయించిన ఫోన్ నెంబర్ ఇప్పటికీ గుర్తుందని తెలిపారు. ఇక్కడ తనకు మధుర స్మృతులు ఉన్నాయని చెప్పారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సందర్భంగా మహాత్మా గాంధీ లేఖలను చూడడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. 43 ఏళ్ల క్రితం భారత్ లో దక్షిణ కొరియా వైస్ కాన్సుల్ గా బాన్ కీ మూన్ విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన భారత్ ను అనేకమార్లు సందర్శించారు. ఐరాస చీఫ్ హోదాలో నాలుగు సార్లు భారత్ వచ్చారు. ఢిల్లీ వస్తే తాను సంపూర్ణ మానవుడిలా మారిపోతానని, ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News