: ఉపాధ్యాయులపై ఏపీ మంత్రి మృణాలిని ఫైర్!
తరగతులకు ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులపై ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాలిని మండిపడ్డారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలను నేడు ఆమె తనిఖీ చేశారు. బోధన ఆరంభించాల్సిన సమయం దాటినా విద్యార్థులు ఖాళీగా కూర్చొనివుండటం చూసి విస్తుపోయారు. మంత్రి అక్కడ వుండగా టీచర్లు ఒక్కొక్కరూ స్కూల్ కు రావడం మొదలైంది. మొత్తం 15 మంది టీచర్లు, సిబ్బంది ఆలస్యంగా వచ్చారని ఆమె గుర్తించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి, ఇకపై ఇటువంటి ఘటనలు జరిగితే సస్పెండ్ చేస్తామని ఉపాధ్యాయులను హెచ్చరించారు.