: మనం ఊహించిన దానికన్నా వేగంగా అభివృద్ధి జరుగుతుంది: చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు సంబంధించి సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం ఊహించిన దానికన్నా వేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. మనవాళ్లలో ఉత్సాహం ఉందని, ప్రపంచానికి మనపై నమ్మకం ఉందని అన్నారు. భారత్ లోనే పెట్టుబడులు పెట్టాలన్న ధోరణి ప్రపంచ పెట్టుబడిదారుల్లో బలంగా ఉందని తెలిపారు. చైనా కన్నా మన వద్దే అభివృద్ధికి ఎక్కువ అనుకూలత ఉందని అభిప్రాయపడ్డారు. యూపీఏ తప్పుడు విధానాల వల్ల వ్యాపారవేత్తలు ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు స్పష్టం చేశారు.