: ఒబామాతో విందు మిస్సయిన సానియా మీర్జా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో విందులో పాల్గొనే అవకాశాన్ని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కోల్పోయింది. భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సానియాకు కూడా ఆహ్వానం అందింది. అయితే, ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ కోసం మెల్ బోర్న్ లో ఉంది. దాంతో, విందుకు హాజరుకాలేకపోయినందుకు సానియా ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేసింది. తనను ఆహ్వానించినా రాలేకపోయానని తెలిపింది. విందుకు ఆహ్వానం అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అమ్మడు ట్వీట్ చేసింది.