: అవినీతికి పెద్దబిడ్డ కేసీఆర్... సీబీసీఐడీ దర్యాప్తు జరిపించాలి: టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి పెద్దబిడ్డ అని టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. నాడు మంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడిన కారణంగానే కేసీఆర్ ను చంద్రబాబు తన కేబినెట్ నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై సీబీసీఐడీతో విచారణ జరిపిస్తే నిజానిజాలు వెలుగుచూస్తాయని ఆయన అన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన... అవినీతి పేరు చెప్పి డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలగించిన సీఎం కేసీఆర్, తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ కేబినెట్ లో తెలంగాణవాదులు ఎవరూ లేరన్న ఎర్రబెల్లి, తమపై దుమ్మెత్తిపోస్తున్న నేతలకే కేసీఆర్ పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News