: కోల్ స్కాంలో పురోగతిపై నివేదిక సమర్పించిన సీబీఐ


బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ తన దర్యాప్తు పురోగతిపై నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఇందులో హిందాల్కో కంపెనీ పాత్రపై జరిపిన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో అందించింది. దర్యాప్తులో సేకరించిన వాంగ్మూలాలను అందులో పేర్కొంది. దర్యాప్తు పూర్తయ్యేవరకు నివేదిక బహిర్గతం చేయరాదని కోర్టును సీబీఐ కోరింది. అయితే, దర్యాప్తు పూర్తి చేసేందుకు మరో రెండు వారాల గడువు కావాలని కోరింది. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. ఇదే కేసులో గతేడాది ఆగస్టులో సీబీఐ క్లోజర్ రిపోర్టును సమర్పించగా, తదుపరి దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం సూచించింది. దాంతో సీబీఐ అధికారులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించారు. హిందాల్కో, ఆదిత్యా బిర్లా గ్రూప్ లపై సీబీఐ ఈనెల 23న తాజాగా కేసు నమోదు చేసింది.

  • Loading...

More Telugu News