: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ కు షరపోవా... టైటిల్ కు చేరువైన రష్యన్ బ్యూటీ
టెన్నిస్ అందాల సుందరి మరియా షరపోవా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో దూసుకెళుతోంది. కొద్దిసేపటి క్రితం ముగిసిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించిన ఈ సుందరి, టైటిల్ రేసులో మరో అడుగు ముందుకేసింది. క్వార్టర్ ఫైనల్ లో భాగంగా ఏడో సీడ్ బౌచర్డ్ పై 6-3, 6-2 స్కోరుతో అలవోకగా విజయం సాధించిన షరపోవా సెమీస్ లో అడుగుపెట్టింది. సెమీస్ లో షరపోవా... ఎక్తరీనా మకరోవాతో తలపడనుంది. 2008లో షరపోవా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సింగిల్స్ టైటిల్ నెగ్గింది.