: పాక్ క్రికెటర్ గదిలో వింత దృశ్యాలు... దెయ్యాలేనని బెంబేలెత్తిన క్రికెటర్
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ యువ క్రికెటర్ హారిస్ సొహైల్ కు వింత అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్ నగరం లింకన్ లో సోమవారం ప్రాక్టీస్ చేసిన పాక్ జట్టు, అక్కడి స్థానిక హోటల్ లో బస చేసింది. ఈ క్రమంలో సొహైల్ కు తన గదిలో వింత దృశ్యాలు కనిపించాయట. ఆ దృశ్యాలను దెయ్యంగా భావించిన సొహైల్ వణికిపోయాడట. దీంతో అతడికి జ్వరం కూడా వచ్చేసింది. ఆ దెబ్బతో బెంబేలెత్తిపోయిన సొహైల్, తన గదిని మార్చమని హోటల్ యాజమాన్యాన్ని కోరాడట. వెనువెంటనే స్పందించిన హోటల్ సిబ్బంది సొహైల్ ను వేరే గదిలోకి మార్చేశారట.