: కైలాష్ సత్యార్థితో భేటీ కానున్న ఒబామా... నేటితో ముగియనున్న అమెరికా అధ్యక్షుడి పర్యటన


భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేడు నోబెల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థితో భేటీ కానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్ వచ్చిన ఒబామా, నిన్న రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి మధ్యాహ్నంతో భారత పర్యటనను ముగించుకునే ఒబామా, ఢిల్లీ నుంచి నేరుగా సౌదీ అరేబియా వెళ్లనున్నారు. నేటి షెడ్యూల్ లో భాగంగా సిరిఫోర్ట్ లో ఏర్పాటు కానున్న సమావేశంలో ఎంపిక చేసిన ప్రతినిధులను ఉద్దేశించి ఒబామా ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన కైలాష్ సత్యార్థితో ప్రత్యేకంగా భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News