: గౌహతి ఎక్స్ ప్రెస్ పై దుండగుల రాళ్ల దాడి... నలుగురికి గాయాలు


గౌహతి ఎక్స్ ప్రెస్ పై దుండగులు రాళ్లతో దాడి చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల సమీపంలో నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి నేపథ్యంలో రైలును న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. ఈ రాళ్ల దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. దాడిలో పాల్గొన్న మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గాయపడ్డ ప్రయాణికులను పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News