: శాండ్ విచ్ ఆర్డర్ చేస్తే... క్యాష్ బ్యాగు వచ్చింది!
అమెరికాలో జానెల్లె జోన్స్ అనే మహిళకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ రోజు ఆమె చికెన్ శాండ్ విచ్ ఆర్డర్ చేసింది. రెస్టారెంట్ సిబ్బంది ఆమె చిరునామాకు వచ్చి ఓ బ్యాగు అందజేశారు. తెరిచి చూసిన జోన్స్ కు అందులో శాండ్ విచ్ కనిపించలేదు. దాని స్థానంలో క్యాష్ బ్యాగు దర్శనమిచ్చింది. పొరబాటున అది తమకు పంపారని భావించిన ఆ నిజాయతీపరురాలు వెంటనే భర్త మాథ్యూ జోన్స్ తో కలిసి రెస్టారెంటుకు వెళ్లింది. అక్కడి వారికి ఆ బ్యాగును తిరిగిచ్చేసింది. దీంతో, జోన్స్ దంపతుల నిజాయతీకి మెచ్చిన హోటల్ వాళ్లు ఐదు భోజనాలు ఉచితంగా అందిస్తామని చెప్పారట. క్యాష్ బ్యాగు తిరిగి ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. ఆ బ్యాగులో ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,61,349 రూపాయలు ఉన్నాయట.