: ఇద్దరు చంద్రులూ సంతోషంగా ఉన్నారంటున్న నరసింహన్
గవర్నర్ నరసింహన్ హైదరాబాదు రాజ్ భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖరరావు హాజరయ్యారు. వీరిద్దరితో గవర్నర్ నరసింహన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ, ఇద్దరు సీఎంలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలు బాగా జరిగాయని అన్నారు. 'ఎట్ హోం' కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని గవర్నర్ దంపతులు పేరుపేరునా పలకరించడం విశేషం.