: మోదీ డ్రెస్సుపై ఉన్నది చారలు కాదు... ఆయన పేరు!


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, తన దుస్తుల విషయంలో శ్రద్ధ కనబరుస్తున్నారు. అద్భుతమైన కుర్తాలు, డాషింగ్ సూట్లు ధరిస్తున్న ప్రధాని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒబామా వచ్చిన రోజు సాయంత్రం సమయంలో ఆయన ధరించిన ఓ సూట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నేవీ బ్లూ కలర్ లో ఉండి, పిన్ స్ట్రయిప్స్ (సన్నని నిలువు చారలు) ఉన్న బంద్ గలా కోటు ధరించారని ఫోటోలు చూసి అంతా అనుకున్నారు. కానీ, అవి పిన్ స్ట్రయిప్స్ కావని, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అన్న పేరులోని అక్షరాలే అలా నిలువుగా ఉన్నాయని తెలిసింది. మోదీ పేరులోని అక్షరాలు నేతలోనే వచ్చేలా నేసిన వస్త్రంతో ఈ బంద్ గలా కోటు రూపొందించారట. అలా కోటుపై ఆయన పేరు వెయ్యిసార్లు వస్తుందట. ఇవాళ సోషల్ మీడియాలో ఈ విషయమే చర్చనీయాంశం అయింది. ఈ కోటు ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో అందరూ షేర్ చేసుకుంటూ, ట్వీట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News