: గణతంత్ర వేడుకలకు కేజ్రీని ఆహ్వానించనందుకు 'ఆప్' మండిపాటు
ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించనందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 'ఆప్' నేత ఆశిష్ ఖేతన్ మాట్లాడుతూ, "జాతీయ కార్యక్రమాలను రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవడం సరికాదు. ప్రత్యేకంగా ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇది సముచితం కాదు" అన్నారు. ఇదే సమయంలో ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీని వేడుకల్లో ముందు వరుసలో కూర్చోబెట్టారన్నారు. కానీ, ఢిల్లీ మాజీ సీఎం అయిన కేజ్రీవాల్ ను వేడుకలకు ఆహ్వానించలేదని ఖేతన్ ఆవేదన వ్యక్తం చేశారు.