: 'భారతరత్న'కు అమితాబ్ అర్హుడు: మమతా బెనర్జీ
దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'కు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అర్హుడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆయనకు 'పద్మ విభూషణ్' సరిపోదన్నారు. "తన సమకాలికుల మధ్య అమితాబ్ బచ్చన్ లెజెండ్. 'పద్మ విభూషణ్' సరిపోదు. తనకున్న హోదాకు ఆయన 'భారతరత్న'కు అర్హులు" అని బెనర్జీ పేర్కొన్నారు. ఈ మేరకు 'బిగ్ బి'కి అత్యున్నత పురస్కారం ఇవ్వాలంటూ ఆమె భారత ప్రభుత్వాన్ని పరోక్షంగా డిమాండ్ చేశారు. దీదీకి అమితాబ్ తో మంచి పరిచయం ఉంది. గతేడాది కోల్ కతా ఫిల్మ్ ఫెస్టివల్ కు 'బిగ్ బి' సహా ఆయన కుటుంబమంతా హాజరైంది.