: ఒక్క రూపాయితో ఎన్ని చేయవచ్చో!
ఒక్క రూపాయి ఇచ్చి షాపింగ్ చేయమంటే మీరు ఏం చేస్తారు? అసలు ఒక్క రూపాయికి ఏమి వస్తుంది? ఇదే ప్రశ్నను సంధిస్తూ ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజలు ఇచ్చిన సమాధానాలు క్రోడీకరిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. రూపాయికి కొనగలిగే వాటిల్లో అత్యధిక విలువను చొక్కా గుండీలకు ఆపాదించారట. ఆ తరువాతి స్థానం కాఫీ పౌచ్ లదే. పని ఒత్తిడి పెరిగినా, లేదా నిద్రమత్తులో ఉన్నా వాటిని దూరం చేసుకునేందుకు కాఫీ ఉపయోగపడుతుంది కదా! ఇక, ఒక రూపాయితో రెవెన్యూ స్టాంపులు కొనవచ్చు, క్యాడ్ బారీ చాక్లెట్, లోకల్ టెలిఫోన్ కాల్, షాంపూ సాషే, తలకు పెట్టుకునే నూనెలు, సేఫ్టీ పిన్స్, పేపర్ పిన్స్, వాషింగ్ పౌడర్ సాషే, ఇంటర్నెట్ నుంచి ప్రింట్ అవుట్, జిరాక్స్ కాపీ, తలనొప్పి మాత్ర, బొట్టు బిళ్ళలు, కుంకుమ, పసుపు సాషేలు, మౌత్ రిఫ్రెషనర్లు, వక్కపొడి వంటివి ఎన్నో కొనుక్కోవచ్చు అని ప్రజలు తెలిపారు. ఇవన్నీ కాకుంటే చిల్లర రూపంలో ఉంచుకోవచ్చు అని ముక్తాయించారు.