: మలేషియా ఎయిర్ లైన్స్ వెబ్ సైటును హ్యాక్ చేసిన 'సైబర్ కాలిఫేట్'
ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపుకు చెందిన 'సైబర్ కాలిఫేట్' బృందం మలేషియా ఎయిర్ లైన్స్ వెబ్ సైటును హ్యాక్ చేసింది. నేడు వెబ్ సైటును తెరిచిన వారికి "404 - విమానం ఆచూకీ దొరకలేదు" ఆ విమానాన్ని "సైబర్ కాలిఫేట్ హ్యాక్ చేసింది" అని మెసేజ్ వెక్కిరించింది. ఆ తరువాత కాసేపటికే ఒక బల్లి బొమ్మ ఆ వెబ్ సైట్ స్క్రీన్ పై కనిపించింది. గత సంవత్సరం రెండు అతిపెద్ద విమాన ప్రమాదాలు జరుగగా ఆ రెండు విమానాలూ మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందినవేనన్న సంగతి తెలిసిందే. ఎంహెచ్ 370 విమానం కనపడకుండా పోగా, ఆ విమానం ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు.