: ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి స్వైన్ ఫ్లూ... ముగ్గురి మృతి


తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభణ ఎంతమాత్రమూ తగ్గలేదు. సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రిలోని కొందరు వాయుసేన సిబ్బందికి కూడా వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే 52 కొత్త స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కాగా, వ్యాధితో ముగ్గురు మరణించారు. దీంతో, ఇప్పటివరకు స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 25కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 390 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నియంత్రణ గురించి పట్టించుకోలేదన్న కారణంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యను నిన్న బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News