: వైభవంగా ప్రారంభమైన గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు అద్భుతరీతిలో ప్రారంభమయ్యాయి. పతాకావిష్కరణ తరువాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అశోక చక్ర పురస్కారాలను వీర జవాన్ల కుటుంబ సభ్యులకు అందించారు. ఆపై నాలుగు ఎంఐ-17 హెలికాప్టర్లు రాష్ట్ర భవన్ మీదుగా రాజ్ పథ్ మార్గంలో జాతీయ జెండాలతో వెళ్ళడంతో అధికారికంగా సైనిక ప్రదర్శన ప్రారంభం అయింది. ప్రస్తుతం త్రివిధ దళాలకు చెందిన సైనికుల కవాతు జరుగుతోంది. ఆ తరువాత భారత సైన్యం వద్ద ఉన్న ఆయుధాల పరేడ్ జరగనుంది.