: ఢిల్లీలో వర్షం... అయినా కదలని జనం
ఈ ఉదయం నుంచి ఢిల్లీలో ఓ మోస్తరు వర్షం పడుతోంది. దీనికితోడు చలిగాలులు వీస్తున్నా గణతంత్ర వేడుకలు దగ్గరుండి చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. వీరంతా వర్షంలో తడుస్తూనే వేడుకల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాగా, గణతంత్ర వేడుకలకు బయలుదేరిన ప్రధాని మోదీ తొలుత ఇండియా గేటు వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. రాజ్ పథ్ వద్దకు ఆయన రాగానే ప్రజలు పెద్దఎత్తున అభివాదం చేశారు. ఆయన సైతం ఉత్సాహంగా చేతులు ఊపుతూ ప్రజలను పలకరించారు.