: పదేళ్ల క్రితం వద్దనుకున్నా... ఇప్పుడు చింతిస్తున్నా: కేంద్ర మంత్రి సుజనా చౌదరి


‘పదేళ్ల కిందట నిజంగా నేను కృష్ణాజిల్లాలో పరిశ్రమలు పెట్టకూడదనుకున్నా.. ఇక్కడి వాతావరణం, పరిస్థితులు పరిశ్రమలకు అనుకూలించవనే భావన నాకు ఉండేది’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. విజయవాడలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అప్పటి తన అంచనాలు తప్పని అన్నారు. అప్పట్లోనే పరిశ్రమలు పెట్టి ఉంటే మేలు జరిగి ఉండేదని, ఆ దిశగా అడుగులు వేయలేకపోయినందుకు కొంత బాధగా ఉన్నా, మున్ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలను అభివృద్ధి చేయగలమన్న నమ్మకం ఉందని తెలిపారు. ఆ దమ్ము, ధైర్యం, ప్రతిభ మన ప్రాంతం వారికి ఉన్నాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News