: అందరికీ ఆదర్శంగా ఉండేలా కొత్త రాజధాని: గవర్నర్


అందరికీ ఆదర్శంగా ఉండేలా కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ, జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య పుట్టిన గడ్డపై జాతీయ జెండా ఎగురవేయడం అత్యంత సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. తన ప్రభుత్వానికి స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలని, మార్చి 31లోగా అన్ని శాఖల్లో ఈ-గవర్నెన్స్ విధానం అమల్లోకి వస్తుందని వివరించారు. కొత్త రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని జపాన్ హామీ ఇచ్చిందని, రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. త్వరలో కృష్ణపట్నం వద్ద 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం చేపడతామని, పోలవరం కాలువల నిర్మాణం 50 శాతం పూర్తయిందని తెలిపారు. ఈ సంవత్సరం జరిగే పవిత్ర గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News