: ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం పూర్వజన్మ సుకృతం: నరసింహన్


ఎందరో మహనీయుల జన్మభూమి ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం, ఆంధ్ర భాష మాట్లాడటం ఎంతో అదృష్టమని గవర్నర్ నరసింహన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గౌరవ వందనాన్ని స్వీకరించి, వివిధ విభాగాల శకటాల ప్రదర్శనను తిలకించిన తరువాత ఆయన ప్రసంగించారు. పూర్వజన్మ సుకృతం వల్లే ఆంధ్రలో పుడతారని ఆయన అన్నారు. ఏడు నెలల వయసున్న తన ప్రభుత్వం 'స్మార్ట్'గా పని చేస్తోందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తోందని వివరించారు.

  • Loading...

More Telugu News