: ఏపీలో స్వైన్‌ ఫ్లూ ప్రమాద ఘంటికలు... 18కి చేరిన కేసులు, ఇద్దరి మృతి


ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ ఫ్లూ ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. రాష్ట్రంలో వ్యాధిబారినపడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 8 జిల్లాల పరిధిలో 18 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. వాతావరణం చల్లబడటమే దీనికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే స్వైన్‌ఫ్లూ వ్యాప్తి తగ్గిపోతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. స్వైన్‌ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని ఏపీ వైద్యశాఖ కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఏడు స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. స్వైన్‌ ప్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News