: చాన్నాళ్లకు టీ కలిపిన మోదీ...ముగ్దుడైన ఒబామా!
భారత ప్రధాని చాలా కాలానికి స్వహస్తాలతో టీ కలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమాతో హైదరాబాద్ హౌస్ లో మధ్యాహ్న భోజనం చేసిన మోదీ, ఆయనపై అంతులేని అభిమానం కురిపించారు. అమెరికాతో పటిష్ట బంధాన్ని కోరుకుంటున్న భారత్, అందుకు తగ్గట్టుగానే స్పందిస్తున్నట్టు ఆయన అమెరికా అధ్యక్షుడికి సంకేతాలిచ్చారు. హైదరాబాద్ హౌస్ లో 'వాక్ అండ్ టాక్' సందర్భంగా భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఒబామాకు మోదీ స్వయంగా ఛాయ్ కలిపి అందించారు. మోదీ పూర్వాశ్రమంలో ఛాయ్ వాలా అన్న సంగతి తెలిసిందే. టీని ఆస్వాదిస్తూ వారిద్దరూ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా, అమెరికాతో భారత్ ఎలాంటి బంధం కోరుకుంటోంది? అనే అంశాన్ని మోదీ సూటిగా చెప్పినట్టు సమాచారం. మోదీ చూపిన అభిమానానికి ఒబామా ముగ్ధులయ్యారని తెలుస్తోంది.