: మహాత్ముని సమాధి ముందు చేతులెత్తి నమస్కరించిన ఒబామా


ఈ మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో రాజ్ ఘాట్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట అమెరికా ఉన్నతాధికారుల బృందం రాజ్ ఘాట్ కు వచ్చింది. గాంధీ సమాధిపై పుష్పగుచ్చాన్ని ఉంచిన ఆయన ఒక నిమిషం సేపు మౌనం పాటించారు. అనంతరం సమాధి చుట్టూ తిరిగి పూలు చల్లి చేతులెత్తి నమస్కరించారు. ఆ తరువాత రాజ్ ఘాట్ సమీపంలో ఒక రావి చెట్టును ఆయన నాటారు. ఇక్కడి నుంచి ఆయన హైదరాబాద్ హౌస్ కు చేరుకొని, ప్రధానితో కలసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు.

  • Loading...

More Telugu News